తొలగించిన ఓటర్ల పునఃపరిశీలనకు ప్రత్యేక డ్రైవ్
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:27 AM
రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి అనర్హులుగా తొలగించిన 46.62 లక్షల ఓటర్ల పునఃపరిశీలనకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది.
నేటి నుంచి 46.62 లక్షల ఓటర్ల ఇళ్లకు వెళ్లనున్న బీఎల్‌ఓలు
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి అనర్హులుగా తొలగించిన 46.62 లక్షల ఓటర్ల పునఃపరిశీలనకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో(సర్) భాగంగా వివిధ కారణాలతో సర్ ముసాయిదా ఓటర్ల జాబితాలో తొలగించిన ఓటర్ల పేర్లను మరోసారి పరిశీలించనున్నారు. గురువారం నుంచి బీఎల్‌వోలు జాబితా నుంచి తొలగించిన ప్రతి ఓటరు నివాసానికీ వెళ్లి మరోసారి పరిశీలిస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి..