Share News

హెచ్‌ఐవీ నియంత్రణలో 6 జిల్లాలు ‘సురక్షిత్‌’

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:23 AM

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నియంత్రణలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది

హెచ్‌ఐవీ నియంత్రణలో 6 జిల్లాలు ‘సురక్షిత్‌’

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నియంత్రణలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (నాకో) ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. వీటిలో ఎయిడ్స్‌ నియంత్రణలో మూడు నిర్దేశిత లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించిన ఆరు జిల్లాలకు (చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం) అత్యుత్తమమైన ‘‘సురక్షిత్‌’’ హోదా లభించింది. మూడు లక్ష్యాల్లో రెండింటిని చేరుకున్న పది జిల్లాలకు (అనకాపల్లి, అనంతపురం, బాపట్ల, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, కర్నూలు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, తిరుపతి, కడప) ‘సక్షమ్‌’ గుర్తింపు దక్కింది. మిగిలిన 12 జిల్లాలు ‘సంఘర్షశీల’ విభాగంలో ఉన్నాయి
ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే

Updated Date - Nov 21 , 2026 | 06:25 AM