అంతా నీదే అటగా..?
ABN , Publish Date - Oct 15 , 2026 | 04:27 AM
‘‘లిక్కర్ రవాణా వ్యవహారంలో అంతా నువ్వే నడిపించావట కదా. మీ నాన్న అన్నీ చెప్పారు. ఇక, నువ్వు నిజం చెప్పాలి. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.’’ అని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు
మీ నాన్నే చెప్పారు.. నిజం చెప్పు
చంచల్ గూడ జైల్లో కారుమూరి సునీల్ను ప్రశ్నించిన సిట్ అధికారులు
గుట్టు విప్పిన మాజీ మంత్రి కుమారుడు!
లిక్కర్ రవాణా కేసులో కీలక ట్విస్ట్
అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ‘‘లిక్కర్ రవాణా వ్యవహారంలో అంతా నువ్వే నడిపించావట కదా. మీ నాన్న అన్నీ చెప్పారు. ఇక, నువ్వు నిజం చెప్పాలి. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.’’ అని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు లిక్కర్ రవాణా స్కామ్ నిందితుడు కారుమూరు సునీల్ కుమార్ను ప్రశ్నించారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న సునీల్ను బుధవారం హైదరాబాద్లో సిట్ అధికారులు విచారించారు. లిక్కర్ రవాణాలో ఆయనకు సహకరించిన వ్యక్తులు ఎవరు?. కాంట్రాక్టు ఎలా తీసుకున్నారు?. రేటు ఎంత పెంచారు?. ఎవరి సిఫారసుతో పెంచారు? ఎంత స్కామ్ చేశారు?. తదితర వివరాలు సేకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలిసింది. ఇటీవల మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేసిన సిట్ అధికారులు కోర్టు అనుమతితో విచారణ చేపట్టారు. ప్రతి ప్రశ్నకు.. ‘మా అబ్బాయికే అంతా తెలుసు.’ అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో కుమారుడిని విచారించి అసలు నిజాలను సిట్ అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..