‘వరక’ స్థానానికి అక్కాచెల్లెళ్ల పోటీ
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:41 AM
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం వరక ఎంపీటీసీ స్థానానికి అక్క, చెల్లెలు పోటీ పడుతున్నారు. ఈ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వయింది. బెంతు ఒరియాలకు చెందిన మహిళలకు అవకాశం వచ్చింది. టీడీపీ నుంచి శాంతిజెన్నా, వైసీపీ నుంచి సంగీత జెన్నా నామినేషన్లు దాఖలు చేశారు.
సిక్కోలు జిల్లా కవిటి మండలంలో ఆసక్తికరం
కవిటి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం వరక ఎంపీటీసీ స్థానానికి అక్క, చెల్లెలు పోటీ పడుతున్నారు. ఈ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వయింది. బెంతు ఒరియాలకు చెందిన మహిళలకు అవకాశం వచ్చింది. టీడీపీ నుంచి శాంతిజెన్నా, వైసీపీ నుంచి సంగీత జెన్నా నామినేషన్లు దాఖలు చేశారు. వీరిద్దరూ అన్నదమ్ములైన శ్యాంపురియా, ఒనాదిపురియా కుమార్తెలు. ఒకే కుటుంబానికి చెందిన వరసకు అక్కాచెల్లెళ్లయిన ఇద్దరు మహిళలు పోటీలో నిలవడం ఆసక్తిగా మారింది.
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు