Share News

సర్‌ గడువు మళ్లీ పొడిగింపు!

ABN , Publish Date - Sep 02 , 2026 | 04:32 AM

రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(సర్‌) గడువును కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) మరోసారి పొడిగించింది.

సర్‌ గడువు మళ్లీ పొడిగింపు!

అక్టోబరు 9న తుది జాబితా ప్రచురణ: సీఈవో వివేక్‌ యాదవ్‌

అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(సర్‌) గడువును కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) మరోసారి పొడిగించింది. మంగళవారం రివైజ్డ్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. క్లెయిమ్స్‌, అభ్యంతరాల దాఖలు, వాటి పరిష్కారానికి అదనపు సమయం ఇచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వివేక్‌ యాదవ్‌ తెలిపారు. క్లెయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరణ గడువును తాజాగా ఈ నెల పదో తేదీ వరకు పొడిగించారు. వాటిని అక్టోబరు 5లోపు పరిష్కరిస్తారు. అక్టోబరు 9న రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.

Updated Date - Sep 02 , 2026 | 04:32 AM