ముగిసిన సింబెక్స్-2026
ABN , Publish Date - Oct 28 , 2026 | 06:29 AM
భారత నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన సింగపూర్-భారత్ సముద్ర ద్వైపాక్షిక విన్యాసాలు (సింబెక్స్-2026) మంగళవారం ముగిశాయి.
అలరించిన భారత్, సింగపూర్ నౌకల విన్యాసాలు
విశాఖపట్నం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): భారత నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన సింగపూర్-భారత్ సముద్ర ద్వైపాక్షిక విన్యాసాలు (సింబెక్స్-2026) మంగళవారం ముగిశాయి. రాయల్ సింగపూర్ నేవీ (ఆర్‌ఎస్ఎన్)కి కమాండర్ కల్నల్ బెర్ర్టామ్ ఆంగ్, భారత్ నౌకాదళానికి తూర్పు నౌకాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ రియర్ అడ్మిరల్ విశాల్ బిష్ణోయ్ సారథ్యం వహించారు. హిందూ మహా సముద్రంలో శాంతిభద్రతల మెరుగుదలకు ఈ విన్యాసాలు దోహదపడతాయని నేవీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు