Share News

షావుకారు జానకి మృతి సినీ లోకానికి తీరని విషాదం: మంత్రి కందుల దుర్గేశ్

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:12 PM

ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘షావుకారు’ జానకి మృతి తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె మరణం పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.

షావుకారు జానకి మృతి సినీ లోకానికి తీరని విషాదం: మంత్రి కందుల దుర్గేశ్
Shavukaru Janaki

అమరావతి, ఆగస్టు 21: సీనియర్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘షావుకారు’ జానకి మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షావుకారు జానకి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ‘షావుకారు’ చిత్రంతో సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆమె.. ‘షావుకారు జానకి’గా తెలుగు సినీ రంగంలో విశేష కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారని మంత్రి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో జన్మించిన జానకి సుదీర్ఘకాలం సినీ రంగంలో రాణించారని, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు.


వైవిధ్యమైన పాత్రల్లో సహజ నటనతో కోట్లాది మంది అభిమానులను షావుకారు జానకి సంపాదించుకున్నారని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. తెలుగు చిత్రసీమలో తన అభినయంతో చెరగని ముద్రవేసిన ఆమె మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. షావుకారు జానకి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

భారత నావికులు ప్రయాణిస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. బయటకొచ్చిన వీడియో..

నేను వచ్చానని అద్దె విద్యార్థులను తీసుకొచ్చారు: అభిజీత్ సంచలన ఆరోపణలు..

Updated Date - Aug 21 , 2026 | 07:54 PM