చెదురుమదురుగా వర్షాలు
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:51 AM
కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో బుధవారం ఎండ తీవ్రత కొనసాగింది. కర్నూలులో 36.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ అనిశ్చితితో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి.
విశాఖపట్నం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో బుధవారం ఎండ తీవ్రత కొనసాగింది. కర్నూలులో 36.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ అనిశ్చితితో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. శివారు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతున్నాయి. ఆరోగ్యవరంలో 22.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల్లో మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, తెలంగాణలో పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తాయని పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి..