Share News

ఓటుకు రూ.వెయ్యి

ABN , Publish Date - Sep 30 , 2026 | 04:56 AM

పాఠశాలల యాజమాన్య కమిటీలకు మంగళవారం నిర్వహించిన ఎన్నికలు పంచాయతీ ఎన్నికలను తలపించాయి. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని కొన్ని పంచాయతీల్లో ఓటుకు రూ.వెయ్యి, మందు, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

ఓటుకు రూ.వెయ్యి

  • అనకాపల్లి జిల్లా గౌరీపట్నం స్కూల్‌ కమిటీ ఎన్నికల్లో పంపిణీ

చోడవరం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): పాఠశాలల యాజమాన్య కమిటీలకు మంగళవారం నిర్వహించిన ఎన్నికలు పంచాయతీ ఎన్నికలను తలపించాయి. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని కొన్ని పంచాయతీల్లో ఓటుకు రూ.వెయ్యి, మందు, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. గౌరీపట్నంలోని ప్రాథమిక పాఠశాలలో 47, హైస్కూల్‌లో 74 ఓట్లు ఉన్నాయి. ఈ రెండు స్కూళ్లకు సంబంధించిన ఓటర్లయిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఓటుకు వెయ్యి రూపాయల చొప్పున వైసీపీ నేతలు పంపిణీ చేసినట్టు తెలిసింది. ఈ విషయం తెలిసి కూటమి నేతలు కూడా రూ.వెయ్యి చొప్పున పంచినట్టు చెబుతున్నారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో కూటమి మద్దతుదారులే విజయం సాధించారు. ఇంకా కొన్ని పంచాయతీల్లోని పార్టీల నేతలు ఓటర్లకు నగదు, ఇళ్లలో ఉపయోగించే సామగ్రి పంపిణీ చేసినట్టు తెలిసింది. మరికొన్నిచోట్ల మద్యం, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చినట్టు చెబుతున్నారు.

ఈ వార్తలనూ చదవండి..

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

Updated Date - Sep 30 , 2026 | 04:56 AM