Share News

పీఆర్‌సీ చైర్మన్‌గా దినేశ్‌ బాధ్యతలు

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:11 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుదలకు సంబంధించిన 12వ వేతన సవరణ సంఘం చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి దినేశ్‌ కుమార్‌ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.

పీఆర్‌సీ చైర్మన్‌గా దినేశ్‌ బాధ్యతలు

అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుదలకు సంబంధించిన 12వ వేతన సవరణ సంఘం చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి దినేశ్‌ కుమార్‌ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1983 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయనను పీఆర్‌సీ చైర్మన్‌గా నియమిస్తూ ఈ నెల 1న ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం ఏడాదిలోగా నివేదిక సమర్పించాలని పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి సమాచారాన్ని తీసుకొని ఏడాది గడువులోగా నివేదికను దినేశ్‌ కుమార్‌ ప్రభుత్వానికి సమర్పిస్తారు. రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి వినయ్‌ చంద్‌, అదనపు కార్యదర్శి గౌతమ్‌ అల్లాడ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

Updated Date - Oct 13 , 2026 | 04:11 AM