సెంట్రల్ జీఎస్టీ విశ్రాంత కమిషనర్ కిడ్నాప్
ABN , Publish Date - Oct 17 , 2026 | 04:00 AM
సెంట్రల్ జీఎస్టీ విశ్రాంత కమిషనర్ ఆనందకుమార్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆయన భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే దుండగులను అదుపులోకి తీసుకున్నారు.
విశాఖపట్నం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): సెంట్రల్ జీఎస్టీ విశ్రాంత కమిషనర్ ఆనందకుమార్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆయన భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే దుండగులను అదుపులోకి తీసుకున్నారు. పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సెంట్రల్ జీఎస్టీ విశాఖపట్నం ఆడిట్ కమిషనర్‌గా రెండేళ్ల పాటు పనిచేసిన ఆనందకుమార్ ఈ ఏడాది జూలై 31న ఉద్యోగ విరమణ చేశారు. హైదరాబాద్‌లో స్థిరపడాలనే ఉద్దేశంతో సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్స్‌లో ఇంటిని ఖాళీ చేశారు. ఆయన భార్య గురువారం హైదరాబాద్ వెళ్లిపోగా, ఆనందకుమార్ భీమిలి బీచ్‌రోడ్డులోని హోటల్లో బస చేశారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ వెళ్లేందుకు తన కారులో భోగాపురం విమానాశ్రయానికి బయలుదేరారు.
ఐటీ సెజ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కారును అడ్డుకున్నారు. వారిలో కొందరు డ్రైవర్‌తో పాటు గన్‌మన్‌ను తమ కారులో ఎక్కించుకొని వెళ్లగా, మిగిలినవారు ఆనందకుమార్‌ను అతని కారులోనే విశాలాక్షి నగర్‌కు తీసుకెళ్లి, నిర్బంధించారు. మధ్యాహ్నానికే హైదరాబాద్ చేరాల్సిన ఆనందకుమార్ సాయంత్రమైనా రాకపోవడంతో ఆయన భార్య పోలీసు కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేశారు. గన్‌మన్, డ్రైవర్‌ను వేరే కారులో తీసుకువెళ్లినవారు అడవివరం, శొంఠ్యాం పరిసర ప్రాంతాల్లో తిప్పి మారికవలస వద్ద వదిలేసి పరారయ్యారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు