హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ
ABN , Publish Date - Oct 01 , 2026 | 04:23 AM
రాయలసీమను ఉద్యాన హబ్‌గా అభివృద్ది చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.లక్ష కోట్లు వెచ్చించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.
మదనపల్లెలో ఐహెచ్‌డీపీ ఏర్పాటు
రేపు శంకుస్థాపన చేయనున్న సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర ఆర్థిక మంత్రి
మదనపల్లె/అన్నమయ్య, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాయలసీమను ఉద్యాన హబ్‌గా అభివృద్ది చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.లక్ష కోట్లు వెచ్చించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ను అక్టోబరు 2వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలసి సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. దీనితో పాటు రిలయన్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కూ భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, జిల్లా మంత్రి మండిపల్లె రామ్‌ప్రసాద్‌రెడ్డి బుధవారం పర్యవేక్షించారు. మదనపల్లె బైసాస్ రోడ్డులోని బీకే పల్లె వద్ద సభా ప్రాంగణంతో పాటు పక్కనున్న షెడ్లలో ప్రజలు వీక్షించేలా ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం పరిశీలించేందుకు స్టాల్స్‌ను రూపొందిస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’