Share News

ఏపీలో 29.1 లక్షల మందికి అరుదైన వ్యాధులు

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:08 AM

ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చిన తర్వాత వైద్యం చేయడం కంటే.. రాకముందే నివారణ చర్యలు చేపట్టాలన్న ప్రభుత్వ విధానానికి నెమ్మదిగా అడుగులు పడుతున్నాయి.

ఏపీలో 29.1 లక్షల మందికి అరుదైన వ్యాధులు
illhealth

  • మరింత పెరుగుతున్న సంఖ్య..

  • పదేళ్లలో తగ్గిన మాతాశిశు మరణాలు

  • దేశ సగటుతో పోలిస్తే మెరుగైన ఏపీ

  • అరుదైన వ్యాధుల నివారణకూ

  • ప్రత్యేక ప్రణాళికలు

  • ఆరోగ్య శాఖ నుంచి ప్రతిపాదనలు

  • ప్రభుత్వ పరిశీలన.. ప్రత్యేక పాలసీకి యోచన

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చిన తర్వాత వైద్యం చేయడం కంటే.. రాకముందే నివారణ చర్యలు చేపట్టాలన్న ప్రభుత్వ విధానానికి నెమ్మదిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే సీజనల్‌ వ్యాధుల నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు వల్ల సత్ఫలితాలు వచ్చాయి. మలేరియా, డెంగీ, వైరల్‌ జ్వరాల పట్ల ఆరోగ్యశాఖ చేపట్టిన ముందస్తు చర్యల కారణంగా గత ఏడాది కంటే ఈ ఏడాది సీజనల్‌ వ్యాధులు తక్కువగా నమోదయ్యాయి. ఇదే విధానాన్ని దీర్ఘకాలిక వ్యాధులు, అరుదైన వ్యాధుల విషయంలో పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే అరుదైన వ్యాధుల నివారణకు ప్రత్యేక పాలసీని తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సుమారు 17.3శాతం నుంచి 29.1 లక్షల మంది ప్రజలు అరుదైన వ్యాధితో ఉన్నట్లు అంచనా వేస్తోంది. వీటి నివారణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

మెరుగైన మాతాశిశు సంరక్షణ

గతంలో రాష్ట్రంలో మాతృ, శిశు మరణాలపై సర్వత్రా భయాందోళనలు వ్యక్తమయ్యేవి. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత పదేళ్లల్లో చేపట్టిన చర్య కారణంగా మాతాశిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. గర్భిణులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయడం, అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందించడంతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం ద్వారా మాతాశిశు మరణాల సంఖ్య చాలా వరకూ తగ్గాయి. భారతదేశ సగటుతో పోల్చితే ఏపీలో మాతాశిశు మరణాల సంఖ్య చాలా తగ్గింది.


2013 వరకూ పుట్టిన వెయ్యి మంది చిన్నారుల్లో 39 మంది మరణించేవారు. 2023 నాటికి శిశు మరణాల సంఖ్య చాలా వరకూ తగ్గింది. 2023 లెక్కల ప్రకారం దేశంలో వెయ్యి మంది చిన్నారులకు 25 మంది మరణిస్తే.. మన రాష్ట్రంలో ఆ సంఖ్య 19కి దిగివచ్చింది. 2027 నాటికి మరణాల సంఖ్య 11 నుంచి 12 మించకూడదనే లక్ష్యంతో ఆరోగ్యశాఖ వివిధ పథకాలను అమలు చేస్తోంది. అలానే మాతృ మరణాల సంఖ్య భారీగా తగ్గింది. 2013 లెక్కల ప్రకారం దేశంలో ప్రతి లక్ష మంది గర్భిణుల్లో 162 మంది మరణించే వారు. ఏపీలో ఆ సంఖ్య 92 మంది మాత్రమే. 2026 లెక్కల ప్రకారం దేశంలో ప్రతి లక్ష మంది గర్భిణుల్లో 87 మంది మరణిస్తే, ఏపీలో మాత్రం 39కి చేరింది. దీనిని 20 కంటే తక్కువకు తీసుకువచ్చేందుకు ఆరోగ్యశాఖ వందల కోట్లు ఖర్చు చేస్తోంది. 108 అంబులెన్సులతో పాటు 104 ద్వారా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు వైద్య పరీక్షలు, సమయానికి మందులు అందిస్తోంది. అలానే బాలింతలు, చిన్నారుల కోసం 102 ద్వారా రవాణా సౌకర్యంతో పాటు బేబీ కిట్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది.

3.5 శాతం అరుదైన వ్యాధులు

డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం ఇండియాలో సగటున 3.5 శాతం నుంచి 5.9 శాతం మంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ 3.5 శాతం నుంచి 4.5 శాతం మంది వారికి తెలియకుండానే అరుదైన వ్యాధులతో బాధపడుతున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది.


2011 లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో సుమారు 17.3 శాతం నుంచి 29.1 లక్షల మంది ప్రజలు అరుదైన వ్యాధితో జీవిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరి ంత పెరుగుతున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, సర్వేల డేటాను పెంచిన తర్వాత వీటి సంఖ్య బాధితుల సంఖ్య బ యటకు వచ్చే అవకాశం ఉంది. అత్యధికంగా ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి గుంటూరు, ఉమ ్మడి కృష్ణా, అలానే విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో అరుదైన వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీటి నివారణకు ప్రత్యేక పాలసీ తీసుకుచ్చి, దాని ఆధారంగా వ్యాధు ల నివారణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆరోగ్యశాఖ పాలసీపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. పాలసీలో మరిన్ని మార్పులు, చేర్పులు చేసే పనిలో ప్రభుత్వం ఉంది.

సౌకర్యాలు పెంపు

అరుదైన వ్యాధుల నివారణకు నిధులతో పాటు ప్రత్యేక సౌకర్యాలు అవసరం. ఈ దిశగా ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపులతో పాటు సౌకర్యాల పెంపుపై పాలసీలో ప్రత్యేకంగా పొందుపరుస్తోంది. ప్రజలకు అందుబాటులోకి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఏర్పాటు చేయబోతోంది. ముఖ్యంగా వైద్య సిబ్బంది పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. బయోకెమిస్ట్రీ ఇతర వ్యాధినిర్ధారణ విభాగాలను బలోపేతం చేస్తోంది. వ్యాధి నిర్ధారణ కేంద్రాలతో పాటు కౌన్సెలింగ్‌ సెంటర్లు, రిహాబిలిటేషన్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం గ్యాప్‌ అనాలసిస్‌ చేసుకుని, లోటుపాట్లను సరిదిద్దుకున్న తర్వాతనే అరుదైన వ్యాధుల నివారణపై ఫోకస్‌ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి

ప్రకృతి సాగులో ఏపీ నంబర్‌ వన్.. సీఎం చంద్రబాబుకు శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రశంసలు

ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 05 , 2026 | 05:08 AM