రామ్‌కో నుంచి 121 ఎకరాలు వెనక్కి
ABN , Publish Date - Sep 23 , 2026 | 06:15 AM
సున్నపురాయి మైనింగ్ కోసం రామ్‌కో సిమెంట్స్‌కు గతంలో ఇచ్చిన భూముల్లో 121.74 ఎకరాలు ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ గనుల శాఖ ఉత్తర్వులు
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): సున్నపురాయి మైనింగ్ కోసం రామ్‌కో సిమెంట్స్‌కు గతంలో ఇచ్చిన భూముల్లో 121.74 ఎకరాలు ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రామ్‌కో సిమెంట్స్ కోరిన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖే్‌షకుమార్ మీనా తెలిపారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని ఇటిక్యాల, కాల్వట్ల, కొలిమిగుండ్ల గ్రామాల పరిధిలో రామ్‌కో సిమెంట్స్‌కు ప్రభుత్వం 2000లోనే 250 హెక్టార్లలోని సున్నపురాయి లీజులను కేటాయించింది. అయితే, లీజుకు తీసుకున్న భూముల పక్కనే పంటకాలువ వెళ్లడం, హైటెన్షన్ విద్యుత్ టవర్లు ఏర్పాటు చేయడం వంటి అంశాలు మైనింగ్‌కు ప్రతిబంధకాలుగా మారాయని, అందుకే ఆ భూ ముల్లో కార్యకలాపాలు చేపట్టలేదని కంపెనీ చెబుతోంది.
ఈ వార్తలనూ చదవండి...
పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం