ప్రయాణికురాలి హ్యాండ్ బ్యాగులో ఏకే 47 బుల్లెట్
ABN , Publish Date - Sep 17 , 2026 | 05:32 AM
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో ప్రయాణికురాలి హ్యాండ్ బ్యాగులో తుపాకీ బుల్లెట్ ఉండటం కలకలం రేపింది.
రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో కలకలం
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో ప్రయాణికురాలి హ్యాండ్ బ్యాగులో తుపాకీ బుల్లెట్ ఉండటం కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన గెడ్డం ఉజ్వల బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లడానికి విమానాశ్రయానికి వచ్చారు. తనిఖీల్లో ఆమె హ్యాండ్ బ్యాగులో ఏకే-47 రైఫిల్ బుల్లెట్ లభించింది. కోరుకొండ పోలీసులు ఉజ్వలను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.