AE నూకరాజు భార్య మీనా మృతదేహం లభ్యం..
ABN , Publish Date - Aug 22 , 2026 | 09:07 PM
పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు భార్య మీనా మృతదేహం శనివారం లభ్యమైంది. ఆత్మహత్య చేసుకున్న 7 రోజుల తర్వాత ఆత్రేయపురం మండలం మూలస్థానం అగ్రహారం దగ్గర గోదావరిలో మీనా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు భార్య మీనా మృతదేహం శనివారం లభ్యమైంది. ఆత్మహత్య చేసుకున్న 7 రోజుల తర్వాత ఆత్రేయపురం మండలం మూలస్థానం అగ్రహారం దగ్గర గోదావరిలో మీనా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గత ఆదివారం రాత్రి భార్య, కుమార్తె, మనవడితో సహా నూకరాజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రోడ్‌కం రైలు బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలో దూకారు. మనవడు కార్తికేయ నదిలో ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నెల 17వ తేదీన నూకరాజు, 20వ తేదీన సౌజన్య మృతదేహాలు లభ్యమయ్యాయి.
నిందితుడు సాదిక్ ఖాన్ అరెస్ట్..
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్మ కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ పోలీసులకు పట్టుబడినట్టు తెలిసింది. గత కొద్ది రోజులుగా తప్పించుకు తిరుగుతున్న అతడిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడిని పట్టుకునేందుకు కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి పది ప్రత్యేక బృందాలు వెళ్లాయి. హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, ముంబయి, ఢిల్లీలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఆరు రోజులుగా అణువణువూ గాలించాయి. ఈ క్రమంలో నిందితుడు ఢిల్లీలో పోలీసులకు పట్టుబడినట్టు తెలిసింది.
ఇవి కూడా చదవండి
గోడపైకి ఎక్కిన కోబ్రాను PVC పైపుతో పట్టేశాడు.. వీడియో చూస్తే గుండె ఆగాల్సిందే!
ఉద్యోగాలు, ప్రతిభకు దేశంలోనే నంబర్‌వన్ సిటీగా విశాఖ: సీఎం చంద్రబాబు