రాధాగాయత్రి మృతి కేసు.. ఎట్టకేలకు మీడియాకు స్పందించిన శ్రీచరణ్ తల్లి..
ABN , Publish Date - Jun 26 , 2026 | 03:54 PM
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాధాగాయత్రి మృతి కేసులో నిందితుడిగా ఉన్న ఆమె భర్త శ్రీచరణ్ గత 5 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు. శ్రీచరణ్ అజ్ఞాతంపై అతడి తల్లి సీతా మహాలక్ష్మి మీడియాతో మాట్లాడారు.
విశాఖపట్నం, జూన్ 26: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాధాగాయత్రి మృతి కేసులో నిందితుడిగా ఉన్న ఆమె భర్త శ్రీచరణ్ గత 5 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు. శ్రీచరణ్ అజ్ఞాతంపై అతడి తల్లి సీతా మహాలక్ష్మి మీడియాతో మాట్లాడారు. తన బిడ్డ ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. తన బిడ్డ తప్పు చేస్తే తామే ప్రాణాలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. శ్రీచరణ్ లాయర్ చెప్పినట్టు నడుచుకుంటున్నాడని, అతడు ఎక్కడున్నాడో తమకు తెలియదని అన్నారు. తాము విశాఖని విడిచిపెట్టి వెళ్లేది లేదని, ఇక్కడే ఉంటామని శ్రీచరణ్ తల్లితండ్రులు తేల్చి చెప్పారు.
పెద్ద దినానికి హాజరుకాని శ్రీచరణ్
రాధాగాయత్రి 12వ రోజు పెద్ద దినానికి శ్రీచరణ్ హాజరుకాలేదు. దినం కార్యక్రమాన్ని శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ స్వయంగా నిర్వహించారు. రాధాగాయత్రి కుటుంబసభ్యులు శ్రీచరణ్ ఎక్కడున్నాడో చెప్పమని శ్రీచరణ్ తల్లిదండ్రులను అడిగారు. శ్రీచరణ్ తల్లిదండ్రులు తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. రాధాగాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి.. శ్రీచరణ్ తల్లిదండ్రులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీచరణ్ విశాఖలోనే తలదాచుకుంటున్నాడని వారు ఆరోపిస్తున్నారు.
శ్రీచరణ్‌పై మర్డర్ కేసు..
రాధాగాయత్రి తన భర్త శ్రీచరణ్ సోమయాజులుతో కలిసి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరికి ట్రిప్‌కు వెళ్లింది. ఈ నెల 14వ తేదీన ఆమె అనుమానాస్పదంగా మృతిచెందింది. తమ కుమార్తె మృతికి అల్లుడు శ్రీచరణ్ కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాధాగాయాత్రి తండ్రి పారుపూడి సుధాకర్ ఫిర్యాదు మేరకు ఆమె భర్త శ్రీచరణ్‌పై ముస్సోరీ పోలీసులు హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 103(1) కింద గత శనివారం ఎఫ్‌ఐఆర్ జారీచేశారు.
ఇవి కూడా చదవండి
దారుణం.. బాలిక ఛాతిపై తన్నిన అంగన్వాడీ వర్కర్
ఘనంగా రొట్టెల పండుగ.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ