Share News

నేడు బెజవాడకు రాష్ట్రపతి

ABN , Publish Date - Oct 14 , 2026 | 04:48 AM

రెండ్రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం విజయవాడకు రానున్నారు. ఆమె సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి సాయంత్రం 6.25 గంటలకు ...

 నేడు బెజవాడకు రాష్ట్రపతి

  • సాయంత్రం 6.25 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరానికి రాక

  • అక్కడి నుంచి కనకదుర్గమ్మ సన్నిధికి

  • దర్శనానంతరం రాత్రికి నోవాటెల్‌ హోటల్లో బస

  • మర్నాడు సరస్‌ మేళాను అధికారికంగా ప్రారంభించనున్న ద్రౌపది ముర్ము

  • డ్వాక్రా మహిళలు, లఖ్‌పతి దీదీలతో భోజన సమావేశం

విజయవాడ , అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రెండ్రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం విజయవాడకు రానున్నారు. ఆమె సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఇంద్రకీలాద్రికి చేరుకుని, కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. రాత్రికి నోవాటెల్‌ హోటల్లో బస చేస్తారు. గురువారం ఉదయం 11 గంటలకు పున్నమి ఘాట్‌లో జరిగే ‘జాతీయ సరస్‌ ఆజీవిక మేళా-2026’ను సందర్శించి.. దానిని అధికారికంగా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.10 నుంచి 2.10 వరకు డ్వాక్రా మహిళలు, లఖ్‌పతి దీదీలతో రాష్ట్రపతి భోజనం చేస్తూ ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 2.45కి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి పర్యటనలో సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు.


పకడ్బందీ ఏర్పాట్లు

రాష్ట్రపతి పర్యటన బ్లూ బుక్‌ నిబంధనలకు అనుగుణంగా సజావుగా, సురక్షితంగా సాగేందుకు పలు శాఖల ఉన్నతాధికారులకు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ కీలక బాధ్యతలను అప్పగించారు. విజయవాడ కార్పొరేషన్‌ కమిషనర్‌ను ఓవరాల్‌ ఇన్‌చార్జ్‌గా నియమించారు. క్లోజ్‌ ప్రొటెక్షన్‌ టీం(సీపీటీ), పోలీసు బలగాలు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాయి. రాష్ట్రపతి ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్‌ ఆటంకాలు లేకుండా భద్రతను పటిష్ఠం చేస్తారు. అమ్మవారి ఆలయ సందర్శన సమయంలోనూ, సరస్‌ మేళా వద్ద ప్రత్యేక పాస్‌లు కలిగిన అధికారులను మాత్రమే అనుమతిస్తారు. భద్రత, ఫైర్‌, నిరంతర విద్యుత్‌ సరఫరా, వైద్య సదుపాయాలు, ఆహార నాణ్యత తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

ఈ వార్తలనూ చదవండి:

కొత్త డీఎస్సీలో 290 పోస్టులు

గిన్నిస్‌ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత

Updated Date - Oct 14 , 2026 | 04:48 AM