సరస్‌కు సర్వం సిద్ధం
ABN , Publish Date - Oct 14 , 2026 | 04:46 AM
గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న సరస్ మేళా ఈసారి విజయవాడలో జరగనుంది.
రేపు రాష్ట్రపతి చేతుల మీదుగా బెజవాడలో ప్రారంభం
31 వరకు నిర్వహణ.. దేశ రాజధాని బయట ఇదే తొలిసారి
31 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి
571 మంది మహిళా వ్యాపారవేత్తల భాగస్వామ్యం
విజయవాడ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న సరస్ మేళా ఈసారి విజయవాడలో జరగనుంది. ఇప్పటివరకు 117 జాతీయ సరస్ మేళాలను నిర్వహించిన గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఈ సారి తొలిసారిగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ బయట ఈ మేళాను నిర్వహిస్తుండడం విశేషం. ఈ మేళాను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మేళాను ప్రారంభిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని(శివనాథ్) నేతృత్వంలో అక్టోబరు 15 నుంచి 31 వరకు విజయవాడలోని బబ్బూరి గ్రౌండ్స్, పున్నమి ఘాట్ సమీపంలో ఈ మేళా జరగనుంది.
దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి సుమారు 1,142 మంది మహిళా కళాకారులు, స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళా పారిశ్రామికవేత్తలు ఈ మేళాలో పాల్గొననున్నారు. 571కు పైగా స్టాళ్ల ద్వారా చేనేత, హస్తకళలు, సహజ ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, సంప్రదాయ గ్రామీణ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించనున్నారు. వివిధ రాష్ట్రాల ప్రత్యేక వంటకాలతో భారీ ఇండియా ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత