Share News

నేటినుంచి ‘సరస్‌’ మేళా

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:44 AM

జాతీయ సరస్‌ అజీవిక మేళా-2026కు సర్వం సిద్ధమైంది. విజయవాడ పున్నమి ఘాట్‌లోని సువిశాల ప్రాంగణంలో దేశీయ ఉత్పత్తుల సమ్మేళనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం చంద్రబాబు గురువారం ఉదయం 11.30 గంటలకు అధికారికంగా ప్రారంభించనున్నారు.

నేటినుంచి ‘సరస్‌’ మేళా

  • ప్రారంభించనున్న రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు

  • విజయవాడ పున్నమి ఘాట్‌లో 571 స్టాళ్లతో ఏర్పాటు

విజయవాడ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): జాతీయ సరస్‌ అజీవిక మేళా-2026కు సర్వం సిద్ధమైంది. విజయవాడ పున్నమి ఘాట్‌లోని సువిశాల ప్రాంగణంలో దేశీయ ఉత్పత్తుల సమ్మేళనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం చంద్రబాబు గురువారం ఉదయం 11.30 గంటలకు అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం అదే ప్రాంగణంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటల వరకు స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి భోజనం చేస్తారు. లఖ్‌పతి దీదీ కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పిస్తారు. ఈ కార్యకమం ఏర్పాట్లను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీ కేశినేని శివనాథ్‌ బుధవారం పరిశీలించారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జరిగిన ఏర్పాట్లలో కొన్ని మార్పులు చేయాలని సూచించారు.

పలు రాష్ట్రాల స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. జాతీయ ఫుడ్‌ ఫెస్టివల్‌ ప్రాంగణంలో స్టాళ్లలోని ఆహార ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించి, రాజస్థాన్‌ జిలేబీని రుచి చూశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ దేశంలోని ప్రఖ్యాత టెక్స్‌టైల్స్‌, హ్యాండ్లూమ్స్‌, నాణ్యమైన ఆహార ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పారు. మొత్తం 571 స్టాళ్లతో విజయవాడలో తొలిసారిగా భారీస్థాయిలో జరిగే మేళాను సందర్శించాలని ప్రజలను ఆయన కోరారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్‌ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి

హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..

Updated Date - Oct 15 , 2026 | 05:44 AM