Share News

అంబటి రాంబాబుకు పోలీసుల నోటీసులు

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:34 AM

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

అంబటి రాంబాబుకు పోలీసుల నోటీసులు

కిర్లంపూడి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 8న ఉదయం 10 గంటలకు కిర్లంపూడి పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ముద్రగడ అంత్యక్రియల్లో ప్రభుత్వ లాంఛనాల నిర్వహణ సమయంలో అంబటి రాంబాబు పోలీసు అధికారులను నెట్టివేసి వారితో వాగ్వాదానికి దిగారు. దీనిపై ఏఆర్‌ ఎస్‌ఐ వి.అప్పలరాజు ఫిర్యాదు మేరకు కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 05:34 AM