అక్కడికక్కడే నాణ్యతా పరీక్షలు.. నివేదికలు!
ABN , Publish Date - Oct 17 , 2026 | 04:05 AM
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి ‘అక్కడికక్కడే నాణ్యతా పరీక్షలు’ నిర్వహించే విధానాన్ని ఇంజనీరింగ్ అధికారులు ప్రయోగాత్మకంగా అమలు చేశారు.
పోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌ను పరిశీలించిన నిపుణులు
మట్టి పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన సభ్యులు
అమరావతి/ పోలవరం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి ‘అక్కడికక్కడే నాణ్యతా పరీక్షలు’ నిర్వహించే విధానాన్ని ఇంజనీరింగ్ అధికారులు ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) పనులను పరిశీలించేందుకు వచ్చిన విదేశీ నిపుణుల బృందం (పీవోఈ) తొలి రెండు రోజులు పోలవరం ప్రధాన కట్టడాల డాక్యుమెంటేషన్లను పరిశీలించింది. మూడోరోజు శుక్రవారం ఈసీఆర్‌ఎఫ్‌కు సంబంధించి కోర్ నిర్మాణాల్లోని నాణ్యతను రెండుచోట్ల పరిశీలించగా, అధికారులు అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి నివేదికను అందించారు. తొలుత నిపుణుల బృందంలోని రిచర్డ్ డొనెల్లీ, గ్లాన్ ఫ్రాంకో డి సిక్కో, సీన్ హించ్ బెర్గర్, డేవిడ్ పాల్‌తో పాటు పీపీఏ సీఈవో సంజీవ్ వోబ్రా సూచనల మేరకు సిబ్బంది
రెండు ప్రాంతాల్లో నిర్దేశిత కొలతలతో పెద్ద గుంతలు తవ్వారు. వాటిలోకి దిగిన నిపుణులు మట్టి గట్టిదనాన్ని స్వయంగా పరిశీలించారు. సంజీవ్ వోబ్రా సైతం పలుగు, పార పట్టుకుని మట్టిని తవ్వి నాణ్యతా పరీక్షల్లో పాల్గొన్నారు. డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో షీప్ ఫుట్ రోలర్‌ను తిప్పించి మట్టి ఏ మేరకు గట్టిపడుతుందో పరిశీలించారు. పనులు బాగా జరుగుతున్నాయని నిపుణుల బృందం ప్రశంసించింది. అనంతరం ప్రాజెక్టు ప్రాంతంలోని ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించి పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు