Share News

పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల శిక్ష

ABN , Publish Date - Oct 07 , 2026 | 05:46 AM

ఒక బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు నమోదైన పోక్సో కేసులో నిందితునికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తూ కర్నూలు పోక్సో కోర్టు న్యాయాధికారి ఈ.రాజేంద్రబాబు మంగళవారం తీర్పు చెప్పారు.

పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల శిక్ష

కర్నూలు లీగల్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ఒక బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు నమోదైన పోక్సో కేసులో నిందితునికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తూ కర్నూలు పోక్సో కోర్టు న్యాయాధికారి ఈ.రాజేంద్రబాబు మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందివర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చెరువుపల్లికి చెందిన ఒక బాలిక (10 సంవత్సరాలు) 2022 ఫిబ్రవరి 9న తన ఇంటి ఎదుట ఆడుకుంటోంది. ఆ బాలికను చూసిన అదే గ్రామానికి చెందిన మాదిగ శివుడు (42) మాయమాటలు చెప్పి గ్రామ పొలిమేరలోని గడ్డివాము వద్దకు తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు శివుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఐదేళ్ల కఠిన శిక్షతో పాటు రూ.50వేల జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 05:46 AM