పీఏం కిసాన్ లబ్ధికి ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి
ABN , Publish Date - Sep 18 , 2026 | 06:27 AM
త్వరలో విడుదల కానున్న పీఎం కిసాన్ పథకంలో లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో విశిష్ట సంఖ్యను తప్పనిసరిగా పొందాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ స్పష్టం చేశారు.
అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): త్వరలో విడుదల కానున్న పీఎం కిసాన్ పథకంలో లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో విశిష్ట సంఖ్యను తప్పనిసరిగా పొందాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పీఎం కిసాన్ పథకానికి 64,71,800 మంది రైతులు నమోదు చేసుకోగా, ఇందులో 52,06,777 మంది ఫార్మర్ రిజిస్ర్టీలో నమోదయ్యారని తెలిపారు. మిగతా 7,34,215 మంది తక్షణమే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలన్నారు. సొంత భూమి ఉండి, పీఎం కిసాన్‌లో తొలి విడత సాయం పొందినా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు కాకపోతే, అనర్హుల జాబితాలో చేర్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫార్మర్ రిజిస్ట్రీలో ఏపీ ఆరో స్థానంలో ఉందని గురువారం తెలిపారు.
మార్క్‌ఫెడ్‌కు 10కోట్లు
ఏపీ మార్క్‌ఫెడ్‌లో ప్రభుత్వ వాటా మూలధనాన్ని రూ.30కోట్లకు పెంచేందుకు రూ.10కోట్లు అదనపు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. కాగా ఉద్యాన శాఖలో కమిషనర్, అదనపు డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ పోస్టులను ప్రభుత్వం నేరుగా నియమిస్తుందని, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఉద్యాన అధికారులు, పరిపాలనాధికారులను అన్ని జోన్లలో కమిషనర్ నియమించే అధికారం ఉంటుందని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ వార్తలనూ చదవండి: