విశాఖ ఉక్కుకు సొంత గనుల కోసం పిల్
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:57 AM
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకపోవడంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకపోవడంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ఉక్కు శాఖ, కేంద్ర గనుల శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గనుల శాఖ ముఖ్యకార్యదర్శి, మైనింగ్ శాఖ డైరెక్టర్, ఏపీ మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ వీసీఎండీ, ఆర్‌ఐఎన్‌ఎల్ వీసీఎండీకి నోటీసులు జారీ చేసింది. పిల్ విచారణార్హతపై కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం లేవనెత్తుతున్న అంశంపై విచారణను పెండింగ్‌లోనే ఉంచుతున్నామని పేర్కొంది. విచారణను వాయిదా వేసింది.
ఈ వార్తలనూ చదవండి..