Share News

ఆ టీచర్లకు టెట్‌ పెట్టకపోవడంపై పిల్‌

ABN , Publish Date - Oct 08 , 2026 | 04:42 AM

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ)ల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో టీచర్లను మినహాయించి, కేవలం ప్రభుత్వ (ఇన్‌ సర్వీస్‌), ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేసే వారికి ప్రత్యేక టెట్‌ నిర్వహించేందుకు పాఠశాల విద్య కమిషనర్‌ నిర్ణయించడాన్ని సవాల్‌ చేస్తూ...

ఆ టీచర్లకు టెట్‌ పెట్టకపోవడంపై పిల్‌

అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ)ల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో టీచర్లను మినహాయించి, కేవలం ప్రభుత్వ (ఇన్‌ సర్వీస్‌), ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేసే వారికి ప్రత్యేక టెట్‌ నిర్వహించేందుకు పాఠశాల విద్య కమిషనర్‌ నిర్ణయించడాన్ని సవాల్‌ చేస్తూ విజయవాడకు చెందిన డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

'

ఈ వార్తలనూ చదవండి..

రైతన్నకు ఊరటేదీ?

ప్రజల చెంతకు వైద్య సేవలు

Updated Date - Oct 08 , 2026 | 04:42 AM