రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన జగన్
ABN , Publish Date - Oct 06 , 2026 | 06:39 AM
వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని అలంకరాయనిపేటలో సోమవారం ...
వైసీపీ హయాంలో 9.74 లక్షల కోట్ల అప్పు: మంత్రి పయ్యావుల
బుక్కరాయసముద్రం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని అలంకరాయనిపేటలో సోమవారం జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, భూమి పూజలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వైఎస్ జగన్ రూ.9.74 లక్షల కోట్ల అప్పలు చేశారని అన్నారు. ఈ అప్పులు అధిగమిస్తూనే కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తోందన్నారు. రాష్ట్ర ఆదాయంలో అధికశాతం ఉద్యోగుల జీతాలు, పింఛన్లకే సరిపోతోందని అన్నారు. ఢిల్లీ నుంచి మన రాష్ట్రానికి వచ్చే నిధులు చేసిన అప్పులకి సరిపోవడం లేదని అన్నారు. అయినా అభివృద్ధి, సంక్షేమం ఆగకుండా చూస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి, ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి, ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, బండారు శ్రావణిశ్రీ, సురేంద్రబాబు, జయరాం, పల్లె సింధూరా రెడ్డి తదితరుల పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం