Share News

అభిమానికి పవన్‌ బహుమతులు..!

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:10 AM

అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని పొనుగోటి నిరంజన్‌ను స్వయంగా వచ్చి కలిసిన జనసేన పార్టీ చీఫ్‌, ఏపీ...

అభిమానికి పవన్‌ బహుమతులు..!

  • ఇచ్చిన మాట మేరకు ట్యాబ్‌, పప్పీని పంపిన ఏపీ డిప్యూటీ సీఎం

  • నిరంజన్‌ ఇంటికెళ్లి అందజేసిన పవన్‌ టీమ్‌ సభ్యులు

వరంగల్‌ కార్పొరేషన్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని పొనుగోటి నిరంజన్‌ను స్వయంగా వచ్చి కలిసిన జనసేన పార్టీ చీఫ్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. అతడు అడిగిన కోరికలను కూడా గంటల వ్యవధిలోనే తీర్చేశారు. బుధవారం హనుమకొండలోని తమ ఇంటికి పరామర్శించడానికి వచ్చిన పవన్‌ను ఆడుకోడానికి ఒక కుక్క పిల్ల (పప్పీ)తో పాటు వీడియోలు, సినిమాలు చూడడానికి ఒక ట్యాబ్‌ కావాలని నిరంజన్‌ అడిగాడు. అప్పటికప్పుడు స్పందించిన పవన్‌.. వాటిని తెప్పించాలని తన పీఏ, పీఆర్‌వోతో పాటు టీం సభ్యులను ఆదేశించారు. దీంతో పవన్‌ టీం సభ్యులు, జనసేన కార్యకర్తలు వినయ్‌, పృథ్వీలు హైదరాబాద్‌లో డాగ్‌ ఫాంలో అత్యంత ఖరీదైన లాసా అప్సో జాతికి చెందిన ఒక కుక్క పిల్లతో పాటు సామ్‌సంగ్‌ కంపెనీకి సంబంధించిన ట్యాబ్‌ను తీసుకుని బుధవారం రాత్రి హనుమకొండకు చేరుకున్నారు. గురువారం తల్లిదండ్రులు రాంగోపాలచారి-మానస, చెల్లి రక్షిత చేతుల మీదుగా వాటిని నిరంజన్‌కు అందించారు. అడిగిన వెంటనే బహుమతులు పంపిన పవన్‌కు నిరంజన్‌, అతడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 19 , 2026 | 03:27 AM