Share News

పట్టిసీమ నీటి విడుదల నిలిపివేత

ABN , Publish Date - Oct 28 , 2026 | 05:19 AM

పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు నీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. గోదావరిలో నీటిమట్టం 14 మీటర్లు నమోదు కావడం, తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో నీటి విడుదలను నిలిపివేసినట్లు మంగళవారం ఈఈ యేసుబాబు తెలిపారు.

పట్టిసీమ నీటి విడుదల నిలిపివేత

పోలవరం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు నీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. గోదావరిలో నీటిమట్టం 14 మీటర్లు నమోదు కావడం, తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో నీటి విడుదలను నిలిపివేసినట్లు మంగళవారం ఈఈ యేసుబాబు తెలిపారు. ఈ ఏడాది జూన్‌ 8 నుంచి ఇప్పటి వరకు 66.3267 టీఎంసీల నీటిని పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి విడుదల చేశారు. పట్టిసీమ ఆరంభం నుంచి ఇప్పటి వరకూ 508.7766 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఈఈ తెలిపారు. తుఫాను ప్రభావంతో వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉండడంతో నీటి విడుదల నిలిపివేసినట్లు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Updated Date - Oct 28 , 2026 | 05:19 AM