Share News

కోరి తెచ్చుకుని బురద జల్లుతారా?

ABN , Publish Date - Sep 22 , 2026 | 06:08 AM

‘డీవీ సత్యప్రసాద్‌ను ఏరికోరి ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా జగన్‌ నియమించుకున్నారు. ఇప్పుడేమో పిచ్చివాడంటూ బురద చల్లుతున్నారు’ అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు.

కోరి తెచ్చుకుని బురద జల్లుతారా?

  • సత్యప్రసాద్‌కు మతిస్థిమితం లేదంటూ జగన్‌ మీడియా రోత, అబద్ధాల రాతలు: పట్టాభి

అమరావతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘డీవీ సత్యప్రసాద్‌ను ఏరికోరి ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా జగన్‌ నియమించుకున్నారు. ఇప్పుడేమో పిచ్చివాడంటూ బురద చల్లుతున్నారు’ అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘2014 నుంచే ఆయనకు మతిస్థిమితం లేదంటూ వైసీపీ రోత మీడియాలో రాస్తున్న రాతలన్నీ పచ్చి అబద్ధాలు. 2019 నవంబరు 15న నాటి సీఎం జగన్‌ ముఖ్య సలహాదారుగా ఉన్న అజయ్‌కల్లాం సంతకంతో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీకి సత్యప్రసాద్‌ నియామకంపై అత్యవసర ఆదేశాలు జారీ అయ్యాయి. సాక్షాత్తు నాటి సీఎం జగన్‌ కోరుకున్నారని అజయ్‌ కల్లాం తన లేఖలో పేర్కొన్నారు. 2014 నుంచే మానసిక రోగి అయితే అటువంటి వ్యక్తిని కీలక పోస్టులో నియమించమన్న జగన్‌ ఏ రోగి?’ అని పట్టాభి ప్రశ్నించారు. తన వాదనకు ఆధారాలను ఆయన చూపించారు. లిక్కర్‌ స్కాం పాపాలు బట్టబయలవుతున్నాయన్నారు.

ఈ వార్తలనూ చదవండి....

‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’

ఆర్‌వీ నగర్‌ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక

Updated Date - Sep 22 , 2026 | 06:08 AM