Share News

నేటి నుంచి పాపికొండల విహారయాత్ర ప్రారంభం

ABN , Publish Date - Oct 13 , 2026 | 05:13 AM

రెండు నెలల క్రితం వరదల కారణంగా గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో పోలవరం జిల్లా దేవీపట్నం మండలం పాపికొండలు విహారయాత్రకు వెళ్లే పర్యాటక బోట్లను అధికారులు నిలిపేశారు.

నేటి నుంచి పాపికొండల విహారయాత్ర ప్రారంభం

దేవీపట్నం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): రెండు నెలల క్రితం వరదల కారణంగా గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో పోలవరం జిల్లా దేవీపట్నం మండలం పాపికొండలు విహారయాత్రకు వెళ్లే పర్యాటక బోట్లను అధికారులు నిలిపేశారు. సుమారు రెండు నెలలపాటు గోదావరి వరద ఎక్కువగా ఉండడంతో 72 రోజులుపాటు పోశమ్మ గండి బోట్‌ పాయింట్‌ వద్ద బోట్లు నిలిచిపోయాయి. రెండు రోజుల క్రితం గోదావరి తగ్గుముఖం పట్టడంతో పాపికొండలు విహార యాత్రకు అధికారులు అనుమతులు ఇచ్చారు. మంగళవారం నుంచి పాపికొండలు బోట్లు యథావిధిగా రాకపోకలు సాగించనున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

Updated Date - Oct 13 , 2026 | 05:13 AM