టెక్ హబ్ దిశగా ఏపీ!
ABN , Publish Date - Oct 03 , 2026 | 05:35 AM
రాష్ట్రాన్ని టెక్నాలజీ, ఆవిష్కరణల హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక ముందడుగు పడుతోంది. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, డీప్‌టెక్, స్టార్ట్‌పలు, డిజిటల్ ఆవిష్కరణల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ తదితర రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను
రాష్ట్ర అభివృద్ధికి ఐఐటియన్ల బాసట
నేడు బెజవాడలో పాన్‌ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సదస్సుఅతిథులుగా సీఎం చంద్రబాబు, లోకేశ్
అమరావతి, ఆక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని టెక్నాలజీ, ఆవిష్కరణల హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక ముందడుగు పడుతోంది. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, డీప్‌టెక్, స్టార్ట్‌పలు, డిజిటల్ ఆవిష్కరణల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ తదితర రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపాలన్న ప్రభుత్వ లక్ష్యానికి దేశంలోని ఐఐటీ పూర్వ విద్యార్థులు బాసటగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా పాన్‌ఐఐటీ అలుమ్ని ఇండియా ఆధ్వర్యంలో శనివారం విజయవాడ వేదికగా ‘పాన్‌ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026’ జరగనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో ‘‘ఆంధ్రాస్ రెసిలెంట్ డీప్‌టెక్ డికేడ్: స్వర్ణాంధ్ర టూ వికసిత్ భారత్ 2047’’ థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖల మంత్రి లోకేశ్ హాజరుకానున్నారు. కార్యక్రమంలో ఏఐ, డీప్‌టెక్, క్వాంటం కంప్యూటింగ్, ఆవిష్కరణలు తదితర అంశాలపై చర్చలతో పాటు రౌండ్ టేబుల్ సమావేశాలుంటాయి. ఐఐటీల పూర్వ విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ నిపుణులు, పాలసీ మేకర్లు, సాంకేతిక ఔత్సాహికులు, ఆవిష్కర్తలు.. ప్యానల్ చర్చలు, రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. ఈ సదస్సుకు పాన్‌ఐఐటీ అల్యుమ్ని ఇండియా చైర్మన్, ఐఆర్‌ఎస్ అధికారి ప్రభాత్ కుమార్, వైస్ చైర్మన్ అమితాబ్ రంజన్, పాన్‌ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సదస్సు చైర్మన్ సుధాకర్ గాండె తదితరులు హాజరవుతారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పారిశ్రామికవేత్తలుగా, క్వాంటం కంప్యూటింగ్, హెల్త్ కేర్, ఆగ్రోటెక్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ వంటి రంగాల్లో నిష్ణాతులుగా స్థిరపడ్డ 5లక్షల మంది పాన్ ఇండియా ఐఐటీయన్లు బలమైన నెట్‌వర్క్‌గా ఏర్పడ్డారు. వీరంతా పెట్టుబడిదారులుగా, పారిశ్రామికవేత్తలుగా, శాస్త్రసాంకేతిక నిపుణులుగా రాష్ట్ర ఆర్థిక స్వావలంబనకు చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చారు.
అలుమ్ని భోజన సమాలోచనలు
పాన్‌ఐఐటీ అలుమ్నికి చెందిన ఐఐటీ డైరెక్టర్లు, పారిశ్రామిక సీఈవోలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పాలసీ మేకర్లు, పెట్టుబడిదారులతో కలిసి చంద్రబాబు, లోకేశ్ శుక్రవారం రాత్రి విందు భేటీలో పాల్గొన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఈ భోజన సమాలోచనలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేయనున్న వినూత్న ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడంపై ఐఐటీయన్లు ముఖ్యమంత్రితో చర్చించారు.
మరో 4 ‘క్యూ-శివ’ కంప్యూటర్లు
క్వాంటం కంప్యూటర్ల టెస్టింగ్ ల్యాబ్‌లను దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన క్యూబిట్ సంస్థ మరో నాలుగు ‘క్యూ-శివ’ క్వాంటం హార్డ్‌వేర్ టెస్టింగ్ ల్యాబ్ కంప్యూటర్లను తయారు చేసింది. వీటిని శనివారం పాన్‌ఐఐటీయన్ల సదస్సులో సీఎం ఆవిష్కరిస్తారు. బిడ్డింగ్‌లో ఒక టెస్టింగ్ ల్యాబ్‌ను ఆంధ్రా యూనివర్సిటీ దక్కించుకుంది.
ఈ వార్తలనూ చదవండి..
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు