Share News

పల్నాడులో విషాదం: ఆవు కోసం చెరువులోకి దిగి.. ఇద్దరు వేద విద్యార్థుల మృతి

ABN , Publish Date - Jul 29 , 2026 | 08:01 PM

పల్నాడు జిల్లాలోని అమరావతి మండలం యండ్రాయిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆవు కోసం చెరువులోకి దిగిన ఇద్దరు వేదపాఠశాల విద్యార్థులు లోతైన నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

పల్నాడులో విషాదం: ఆవు కోసం చెరువులోకి దిగి.. ఇద్దరు వేద విద్యార్థుల మృతి
Amaravathi News

పల్నాడు, జులై 29: అమరావతి మండలం యండ్రాయి గ్రామంలో బుధవారం జరిగిన ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది. చెరువు వద్దకు వెళ్లిన ఆవును తీసుకురావడానికి ఇద్దరు వేదపాఠశాల విద్యార్థులు నీటిలోకి దిగినట్లు సమాచారం. అయితే చెరువులో లోతు ఎక్కువగా ఉండటంతో వారు ఒక్కసారిగా నీటిలో గల్లంతయ్యారు. స్థానికులు ఎంత ప్రయత్నించినా వారిని రక్షించలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం చెరువులో నుంచి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. మృతులు పెనుగంచిప్రోలుకు చెందిన శివ (17), రాజమండ్రికి చెందిన కిరణ్ (17)గా పోలీసులు గుర్తించారు.


ఇద్దరూ సమీపంలోని వేదపాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అమరావతి ప్రభుత్వ వైద్యశాలకు పోలీసులు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. శివ, కిరణ్ మృతి వార్త తెలియడంతో వారి స్వగ్రామాలైన పెనుగంచిప్రోలు, రాజమండ్రిలో విషాద వాతావరణం నెలకొంది. చిన్న వయసులోనే ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టబ్‌లో పిల్లలు.. మెడలోతు నీటిలో తండ్రి పోరాటం.. వీడియో వైరల్

అస్సాం వరదలు.. ఆవు దూడ కోసం ప్రాణాలకు తెగించిన వ్యక్తి..

Updated Date - Jul 29 , 2026 | 09:39 PM