కట్నం వేధింపులకు బలైపోతున్న మహిళలు
ABN , Publish Date - Mar 25 , 2026 | 05:39 AM
తెలుగు రాష్ర్టాల్లో వరకట్న వేధింపులకు గత ఐదేళ్లలో 1,304 మంది మహిళలు మరణించారని మంగళవారం లోక్‌సభలో టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నకు..
ఐదేళ్లలో ఏపీలో 526, తెలంగాణలో 778 మరణాలు
లోక్‌సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 24(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో వరకట్న వేధింపులకు గత ఐదేళ్లలో 1,304 మంది మహిళలు మరణించారని మంగళవారం లోక్‌సభలో టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బం డి సంజయ్ సమాధానం ఇచ్చారు. 2019 నుంచి 2023 వరకు ఆంధ్రలో 526 వరకట్న మరణాల కేసులు నమోదయ్యాయి. శిక్షల ఖరారు రేటు ఏపీలో 2023లో 11.5 శాతం ఉంది. తెలంగాణలో ఐదేళ్లలో 778 మంది మ హిళలు వరకట్న వేధింపుల వల్ల మరణించారు. శిక్షల రేటు 2023 నాటికి 14.4 శాతంగా నమోదైంది. దేశం మొత్తమ్మీద చూస్తే ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ర్టాలు వరకట్న మరణాల్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 2023లో దేశవ్యాప్తంగా 6,156 వరకట్న మరణాలు నమోదైనట్లు మంత్రి తెలిపారు.