Share News

అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ

ABN , Publish Date - Sep 27 , 2026 | 03:59 AM

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవదానం ఐదుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన లారీ మెకానిక్‌ సయ్యద్‌ ఇబ్రహీం ఖలీల్‌ ఈ నెల 18న బైక్‌ ఢీకొని గాయపడ్డారు.

అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ

గుంటూరు మెడికల్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవదానం ఐదుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన లారీ మెకానిక్‌ సయ్యద్‌ ఇబ్రహీం ఖలీల్‌ ఈ నెల 18న బైక్‌ ఢీకొని గాయపడ్డారు. చికిత్సలకు ఇబ్రహీం శరరీం సహకరించకపోవడంతో ఈ నెల 20న ఇబ్రహీం ఖలీల్‌(36) బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టు గుంటూరులోని కిమ్స్‌ శిఖర హాస్పిటల్స్‌ వైద్యులు ప్రకటించారు. అనంతరం జీవన్‌దాన్‌ ప్రతినిధులు, బాధిత కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి, అవయవదానం చేస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొంత మందికి పునర్జన్మ లభిస్తుందని తెలిపారు. అవయవదానానికి అంగీకరించడంతో అవయవాలు సేకరించారు. ఊపిరితితిత్తులను చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కు, గుండెను తిరుపతిలోని పద్మావతి హాస్పిటల్‌కు, కాలేయాన్ని, ఒక కిడ్నీని కిమ్స్‌ శిఖర గుంటూరు హాస్పిటల్స్‌కు, మరొక కిడ్నీని గుంటూరులోని ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌కు అందజేశారు. ఐదుగురు రోగులకు ఈ అవయవాలను అమర్చి వారికి కొత్త జీవితాన్ని వైద్యులు ప్రసాదించారు.

ఈ వార్తలనూ చదవండి:

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పర్యాటకం జోరు

Updated Date - Sep 27 , 2026 | 03:59 AM