Share News

ఒకే వీధి.. రెండు గ్రామాలు.. రెండు జిల్లాలు!

ABN , Publish Date - Nov 13 , 2026 | 01:46 AM

ఆ వీధిలో అడుగుపెడితే ఏ గ్రామంలో ఉన్నామో.. ఏమండలంలో ఉన్నామో.. ఏ జిల్లాలో ఉన్నామో అయోమయానికి గురికావాల్సిందే.

ఒకే వీధి.. రెండు గ్రామాలు.. రెండు జిల్లాలు!

  • ఓవైపు ప్రకాశం.. మరోవైపు బాపట్ల..

  • వేర్వేరు తేదీల్లో పంచాయతీ ఎన్నికలు

బల్లికురవ, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ఆ వీధిలో అడుగుపెడితే ఏ గ్రామంలో ఉన్నామో.. ఏమండలంలో ఉన్నామో.. ఏ జిల్లాలో ఉన్నామో అయోమయానికి గురికావాల్సిందే. ఒకే వీధికి సరిహద్దుగా ఓ వైపు ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కె.రాజుపాలెం, మరోవైపు బాపట్ల జిల్లా మార్టూరు మండలం రాజుపాలెం గ్రామం ఉంది. వీధి ఒక్కటే అయినప్పటికీ.. రెండు గ్రామాలు, రెండు మండలాలు, రెండు జిల్లాలు కలిగి ఉండటం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ రెండు గ్రామాలకు రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రాజుపాలెంలో మెదటి విడతలో 26న, కె. రాజుపాలెంలో రెండో విడత 29న ఎన్నికలు జరగనున్నాయి. ఈ గ్రామాల మధ్య భౌగోళికంగా జిల్లా, మండల సరిహద్దులు ఉన్నప్పటికీ ఇక్కడివారంతా కలిసే ఉంటారు. ఎన్నికలు వచ్చిన సమయాల్లో మాత్రమే వారికి రెండు గ్రామాలని గుర్తుకొస్తుంది.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం

ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

Updated Date - Nov 13 , 2026 | 01:49 AM