Share News

పెళ్లి మండపంలోకి ప్రియుడి ఎంట్రీ.. పెళ్లి కూతురు ఏం చేసిందంటే..

ABN , Publish Date - Mar 08 , 2026 | 09:44 AM

పచ్చటి పెళ్లి మండపంలో ఎవ్వరూ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ప్రియుడి ఎంట్రీతో పెళ్లి కూతురు అక్కడ ఉన్న వారందరికీ షాక్ ఇచ్చింది. పీటలపైనే పెళ్లి ఆగిపోయింది.

పెళ్లి మండపంలోకి ప్రియుడి ఎంట్రీ.. పెళ్లి కూతురు ఏం చేసిందంటే..
NTR district wedding stopped

ఎన్టీఆర్ జిల్లా, మార్చి 8: పచ్చటి పెళ్లి మండపంలో ఎవ్వరూ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ప్రియుడి ఎంట్రీతో పెళ్లి కూతురు అక్కడ ఉన్న వారందరికీ షాక్ ఇచ్చింది. పీటలపైనే పెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మైలవరం నియోజకవర్గంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన యువతీయువకుడికి పెళ్లి నిశ్చయం అయింది. శుక్రవారం రాత్రి వరుడి ఇంటి దగ్గర పెళ్లి జరుగుతోంది. మరికొన్ని నిమిషాల్లో వరుడు, వధువు మెడలో తాళి కడతాడన్న సమయంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది.


వధువు ప్రేమించిన యువకుడు అక్కడికి ఎంట్రీ ఇచ్చాడు. వధువు పెళ్లి పీటల మీద నుంచి లేచి ప్రియుడి దగ్గరకు వచ్చి నిలబడింది. మండపంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని, ప్రియుడే కావాలని వధువు తేల్చి చెప్పింది. దీంతో వరుడి కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. యువకుడిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవను ఆపారు. అయితే, యువకుడి కారణంగా పెళ్లి ఆగిపోయింది. వరుడి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


వరుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘మాకు ఒక్కడే కొడుకు. వాడి పెళ్లి అత్యంత ఘనంగా చేయాలని అనుకున్నాం. బంధువులతో పాటు ఊరిలో వారందరినీ పిలుచుకున్నాం. 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. బ్రహ్మాండంగా భోజనాలు కూడా పెట్టాం. వేల మంది విందు భోజనం చేశారు. ఇంత జరిగాక పెళ్లి ఆగిపోయింది. అందరి ముందు మా పరువు పోయింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

మీ ముఖం బంగారంలా మెరిసిపోవాలా? శనగపిండిని ఇలా వాడండి

హుందాగా వెళ్లి చివరకు ఇలాంటి పనులేంటీ.. వీళ్ల నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Updated Date - Mar 08 , 2026 | 10:00 AM