Share News

9 మంది ప్రొఫెసర్లకు పదోన్నతులు

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:12 AM

డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో ఇటీవల అడిషనల్‌ డైరెక్టర్లుగా పదోన్నతులు పొందిన తొమ్మిది మంది సీనియర్‌ వైద్యులకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. వీరందరికి సీఎం చంద్రబాబు ఆమోదం మేరకు పోస్టులు ఖరారు చేశారు.

9 మంది ప్రొఫెసర్లకు పదోన్నతులు

  • నంద్యాల ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ప్రభాకర్‌ రెడ్డి

అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో ఇటీవల అడిషనల్‌ డైరెక్టర్లుగా పదోన్నతులు పొందిన తొమ్మిది మంది సీనియర్‌ వైద్యులకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. వీరందరికి సీఎం చంద్రబాబు ఆమోదం మేరకు పోస్టులు ఖరారు చేశారు. నంద్యాల బోధనాసుపత్రి సూపరింటెండెంటుగా ప్రభాకర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో కార్డియోధొరాసిక్‌ వాస్క్యులర్‌ సర్జన్‌, ప్రొఫెసర్‌గా ఉన్నారు. అలాగే పాడేరు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పి.బుజ్జిబాబు, పాడేరు బోధనాసుపత్రి సూపరింటెండెంట్‌గా సునీల్‌కుమార్‌, పిడుగురాళ్ల బోధనాసుపత్రి సూపరింటెండెంట్‌గా జి.బాలేశ్వరి, మచిలీపట్నం బోధనాసుపత్రి సూపరింటెండెంట్‌గా జి.పద్మశ్రీ, పలాసలోని కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ సూపరింటెండెంట్‌గా ఆనంద్‌ను నియమించారు. రాజమండ్రి బోధనాసుపత్రి సూపరింటెండెంట్‌గా కె.రాంబాబు, నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంటుగా కె.మాధవి, కడప బోధనాసుపత్రి సూపరింటెండెంట్‌గా కె.నవీన్‌కుమార్‌ను నియమించారు.

ఈ వార్తలనూ చదవండి..

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

Updated Date - Sep 30 , 2026 | 05:12 AM