Share News

మ‌ర‌ణంలేని మ‌హా మ‌నిషి ఎన్టీఆర్‌కు జోహార్లు: నారా లోకేశ్

ABN , Publish Date - May 28 , 2026 | 09:28 AM

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులు అర్పించారు.

మ‌ర‌ణంలేని మ‌హా మ‌నిషి ఎన్టీఆర్‌కు జోహార్లు: నారా లోకేశ్
Nara Lokesh

అమరావతి, మే 28: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు గురువారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ప్రపంచానికి తెలుగుజాతి ఖ్యాతిని చాటి చెప్పిన‌ విశ్వ విఖ్యాత న‌ట‌సార్వభౌముడు నంద‌మూరి తార‌క‌రామారావు జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయుని సేవ‌లు స్మరిస్తూ నివాళులు అర్పిస్తున్నాను. తెలుగు జాతి ఆత్మ గౌర‌వంగా తెలుగుదేశం పార్టీ ప‌తాకాన్ని ఎగుర‌వేశారు’..


‘అణ‌గారిన వ‌ర్గాల‌కు అండ‌గా ప‌సుపు జెండాని నిల‌బెట్టారు. మ‌హిళా సాధికార‌త‌కు బాట‌లు వేశారు. ప్రజల కోసం.. ప్రగతి కోసం తెలుగుదేశం పార్టీని అంకితం చేశారు. సంక్షేమానికి చిరునామా అయ్యారు. అన్నా అంటే నేనున్నానంటూ ఆదుకున్నారు. కోట్లాది హృద‌యాల్లో కొలువైన మ‌ర‌ణంలేని మ‌హా మ‌నిషి ఎన్టీఆర్‌కు జోహార్లు. తాతా.. మీరే తెలుగు ప్రజల కీర్తి.. మీరే మాకు నిత్య నూత‌న స్ఫూర్తి’ అని రాసుకొచ్చారు.


ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ 103వ జయంతి.. ఘన నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు

వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్

Updated Date - May 28 , 2026 | 09:30 AM