మేనకోడలి పెళ్లిని అడ్డుకునేవాడు జనానికేం చేస్తాడు..?: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:20 AM
వైఎస్ జగన్, తన మేనకోడలి వివాహం పట్ల వ్యవహరిస్తున్న తీరును మంత్రి లోకేశ్ తప్పు పట్టారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో స్పందించారు. ‘ప్రతి కుటుంబంలో ఒక మేనమామ ఉంటారు. ఆయన, పెళ్లిలో తన మేనకోడలిని ఆశీర్వదించి ఆ వేడుకను చిరస్మరణీయంగా మార్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు.
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): వైఎస్ జగన్, తన మేనకోడలి వివాహం పట్ల వ్యవహరిస్తున్న తీరును మంత్రి లోకేశ్ తప్పు పట్టారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో స్పందించారు. ‘ప్రతి కుటుంబంలో ఒక మేనమామ ఉంటారు. ఆయన, పెళ్లిలో తన మేనకోడలిని ఆశీర్వదించి ఆ వేడుకను చిరస్మరణీయంగా మార్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ జగన్... వైఎ్‌సఆర్ స్వంత కుటుంబ నివాసంలో మేనకోడలి పెళ్లి జరగకుండా అడ్డుకుంటున్నారు. తన సొంత చెల్లెలు, మేనకోడలి పట్ల ఆయన ప్రవర్తిస్తున్న తీరు ఇది. మన అక్క చెల్లెళ్లపట్ల గత ఐదేళ్లు జగన్ ఎలా ప్రవర్తించారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు’ అని లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు