వర్షాల కోసం ప్రార్థనలు
ABN , Publish Date - Oct 10 , 2026 | 05:56 AM
వర్షాలు కురవాలని కోరుతూ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరులోని పెన్నా నదిలో ముస్లింలు సామూహిక నమాజ్, (నమాజ్-ఏ- ఇస్తిస్కా) నిర్వహించారు.
నెల్లూరు(సాంస్కృతికం): వర్షాలు కురవాలని కోరుతూ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరులోని పెన్నా నదిలో ముస్లింలు సామూహిక నమాజ్, (నమాజ్-ఏ- ఇస్తిస్కా) నిర్వహించారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించారు. తీవ్రంగా ఉన్న కరువు నుంచి రైతాంగాన్ని, ప్రజలను రక్షించాలని కోరుకున్నారు. ప్రకృతి సమతుల్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అబ్దుల్ అజీజ్ నమాజ్ అనంతరం మాట్లాడారు. దయామయుడైన భగవంతుడు అందరినీ కష్టాలు నుంచి కాపాడతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు