Share News

పారిశ్రామికవేత్తలుగా పట్టణ మహిళలు

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:42 AM

పట్టణ ప్రాంతాల్లోని మెప్మా మహిళా సంఘాల సభ్యులకు మెరుగైన జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు మున్సిపల్‌ శాఖ దృష్టి సారించింది.

పారిశ్రామికవేత్తలుగా పట్టణ మహిళలు

  • టిడ్కో నివాసాల వద్ద ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి

అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంతాల్లోని మెప్మా మహిళా సంఘాల సభ్యులకు మెరుగైన జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు మున్సిపల్‌ శాఖ దృష్టి సారించింది. ఇందుకోసం టిడ్కో నివాస సముదాయాల వద్ద మెప్మా మహిళల భాగస్వామ్యంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై మున్సిపల్‌ మంత్రి నారాయణ మెప్మా, టిడ్కో అధికారులు, ఎలీప్‌ ప్రతినిధులతో చర్చించారు. మెప్మా మహిళల కోసం ఏర్పాటు చేసే ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను టిడ్కో సమకూర్చనుంది.

ఈ వార్తలనూ చదవండి..

రైతన్నకు ఊరటేదీ?

ప్రజల చెంతకు వైద్య సేవలు

Updated Date - Oct 08 , 2026 | 05:42 AM