Share News

ఒకటే గది.. ఎలా చదివేది?!

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:14 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ అగ్రహారం బాడవలోని ఎంపీయూపీ పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది.

ఒకటే గది.. ఎలా చదివేది?!

  • అంగన్‌వాడీ పిల్లలు, పాఠశాల విద్యార్థులకు ఒకేచోట తరగతులు

  • మంత్రి లోకేశ్‌ దృష్టికి సమస్య..

  • తక్షణమే పరిష్కరించాలని ఆదేశం

ముమ్మిడివరం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ అగ్రహారం బాడవలోని ఎంపీయూపీ పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. అయినప్పటికీ గత ఐదేళ్లుగా ఇదే భవనంలో తరగతులు నిర్వహిస్తూ వచ్చారు. పైకప్పు శ్లాబ్‌ పెచ్చులు ఊడిపోవడంతో పాటు వర్షం వస్తే భవనం నీటిలో నానిపోయి విద్యార్థులకు భద్రత కరువైంది. దీంతో పాఠశాలను ఓ ప్రైవేటు భవనంలోకి మార్చారు. అయితే ఆ భవనం కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో తరగతులను అంగన్‌వాడీ కేంద్రంలోకి తరలించారు.

ఈ పాఠశాలలో 15 మంది విద్యార్థులు, అంగన్‌వాడీ కేంద్రంలో 10మంది చిన్నారులు ఉన్నారు. ప్రస్తుతం పాఠశాల తరగతులు, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఒకే గదిలో నిర్వహిస్తుండటం ఇబ్బందికరంగా మారింది. దీంతో అగ్రహారం బాడవలో నూతన పాఠశాల భవనం నిర్మించాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సమస్యపై వారు ‘ఎక్స్‌’లో పోస్టు చేయడంతో మంత్రి లోకేశ్‌ స్పందించారు. పాఠశాల నూతన భవన నిర్మాణానికి తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ మహేశ్‌కుమార్‌ను ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 05:17 AM