Share News

డ్రగ్స్‌ నివారణకు సమన్వయంతో పనిచేయాలి

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:08 AM

ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి లోకేశ్‌ సూచించారు.

డ్రగ్స్‌ నివారణకు సమన్వయంతో పనిచేయాలి

  • ఏజెన్సీలో ఆపరేషన్‌ చైతన్యం అమలు చేయండి: లోకేశ్‌

  • డ్రగ్స్ నివారణపై మంత్రుల బృందం సమావేశం

అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి లోకేశ్‌ సూచించారు. డ్రగ్స్‌ నివారణపై చర్చించేందుకు హోంమంత్రి అనిత అధ్యక్షతన మంత్రుల బృందం బుధవారం ఉండవల్లిలో సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ...డ్రగ్స్‌ దుష్ఫలితాలపై ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు అవగాహన కల్పించేందుకు ఆపరేషన్‌ చైతన్యం, ఆపరేషన్‌ సేఫ్‌ క్యాంపస్‌ జోన్‌ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. డ్రగ్స్‌, గంజాయి చాక్లెట్ల రవాణాను నిరోధించేందుకు రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయాలన్నారు. యూనివర్సిటీలు, కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులను చైతన్యవంతం చేసే బాధ్యతను ఔత్సాహిక ఉపాధ్యాయులకు అప్పగిస్తామని చెప్పారు. డ్రగ్స్‌ నివారణపై దక్షిణాది రాష్ర్టాల సదస్సు విశాఖపట్నంలో నిర్వహించాలన్నారు. డ్రగ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని మంత్రుల బృందం నిర్ణయించింది. హోంమంత్రి అనిత మాట్లాడుతూ... ఒడిశా నుంచి రాష్ట్రంలోకి గంజాయి రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. డ్రగ్స్‌పై అవగాహనకు బ్రేక్‌ ద సైలెన్స్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలుచేస్తున్నామన్నారు. సమావేశంలో మంత్రులు సత్యకుమార్‌, కొల్లు రవీంద్ర, గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

రైతన్నకు ఊరటేదీ?

ప్రజల చెంతకు వైద్య సేవలు

Updated Date - Oct 08 , 2026 | 05:08 AM