Share News

సిరిమానోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:47 AM

విజయనగరం పైడిమాంబ సిరిమానోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం జొన్నవలసలో సిరిమానోత్సవానికి సంబంధించిన సిరిమాను, ఇరుసు వృక్షాలకు ఆయన కుటుంబ సమేతంగా పూజలు చేశారు.

సిరిమానోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు

  • మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

విజయనగరం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): విజయనగరం పైడిమాంబ సిరిమానోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం జొన్నవలసలో సిరిమానోత్సవానికి సంబంధించిన సిరిమాను, ఇరుసు వృక్షాలకు ఆయన కుటుంబ సమేతంగా పూజలు చేశారు. చెట్టుకు గొడ్డలితో గాటు పెట్టే సాంప్రదాయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సిరిమానోత్సవాన్ని ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆలయ విస్తరణ పనులు పూర్తయిన తరువాత తొలి సిరిమానోత్సవాన్ని జరుపుకొంటున్నామని, ఇందుకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసుల నాయుడు, జడ్పీ మాజీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

Updated Date - Oct 13 , 2026 | 04:47 AM