బీసీ నాయకత్వాన్ని అణచివేసిన వైసీపీ: కొల్లు
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:02 AM
వైసీపీ హయాంలో బీసీ నాయకత్వాన్ని అణచివేశారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో బీసీ నాయకత్వాన్ని అణచివేశారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక సాధికారత కల్పించేందు కు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే బీసీ రక్షణ చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే... చంద్రబాబు 34 శాతానికి పెంచారని తెలిపారు. వైసీపీ హయాంలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి కుదించారని, దీంతో 16,800 మంది బీసీలు రాజ్యాంగబద్ధమైన పదవులకు దూరమయ్యారని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్లోకి 75 గంటల డప్పుమోత