తొండి, దౌర్జన్యాలకు ఆద్యుడు గొడ్డలి పార్టీ అధ్యక్షుడే
ABN , Publish Date - Oct 27 , 2026 | 06:00 AM
ఏపీలోనే కాదు.. దేశంలోనే తొండి, దౌర్జన్యం, దాడులు, అన్యాయం, అరాచకాలకు అంబాసిడర్ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగనేనని అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన రెడ్డి అన్నారు.
వైసీపీ నాయకులకు, కార్యకర్తలకూ నేర్పింది జగనే: మంత్రి జనార్దనరెడ్డి-
మదనపల్లె, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ఏపీలోనే కాదు.. దేశంలోనే తొండి, దౌర్జన్యం, దాడులు, అన్యాయం, అరాచకాలకు అంబాసిడర్ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగనేనని అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన రెడ్డి అన్నారు. మదనపల్లెలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2019లో సీఎం కాగానే జగన్ ఇలాంటివి ఎక్కడ చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. అమరావతిలో ప్రజావేదికతోనే ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించారని.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపైనా దాడులు చేయించారని గుర్తుచేశారు. 2021లో ఎన్నికల సందర్భంగా నామినేషన్ వేసిన టీడీపీ, ఇతర పార్టీల అభ్యర్థుల పట్ల ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసన్నారు. పోటీచేసే అవకాశం లేకుండా.. పోటీ చేసినా, దాడులు, దౌర్జన్యాలతో ఉపసంహరించుకునేలా చేసిన నీచ సంస్కృతి ఆయనదే అంటూ మండిపడ్డారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్