Share News

సన్నద్ధంగా ఉండాలి

ABN , Publish Date - Nov 03 , 2026 | 07:11 AM

మురసు తుఫాన్‌ను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలని విద్యుత్‌ ఉద్యోగులను ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు.

సన్నద్ధంగా ఉండాలి

  • 5 వేలకుపైగా విద్యుత్‌ సిబ్బందితో మంత్రి గొట్టిపాటి టెలీకాన్ఫరెన్స్‌

  • 1912 కాల్‌ సెంటర్‌ 24 గంటలూ అందుబాటులో ఉండాలి

అమరావతి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మురసు తుఫాన్‌ను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలని విద్యుత్‌ ఉద్యోగులను ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు. సోమవారం మూడు డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏపీసీపీడీసీఎల్‌ పరిధిలో మురసు ప్రభావం ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. 5 వేలకు పైగా ఉద్యోగులు టెలీకాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగితే 48 గంటల్లో విద్యుత్తు పునరుద్ధరణ జరగాలన్నారు. తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని, డిస్కంల సీఎండీలు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. అవసరమైతే పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు సిబ్బంది, యంత్రాలను రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. తుఫాన్‌ సమయంలో విద్యుత్తు సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు 1912 టోల్‌ఫ్రీ 24 గంటలూ అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి:

త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి

Updated Date - Nov 03 , 2026 | 07:11 AM