Share News

మెడికల్‌ కాలేజీల్లో మెంటార్‌-మెంటీ వ్యవస్థ!

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:29 AM

ఎంబీబీఎస్‌ వైద్య విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణకు కళాశాలల్లో మెంటార్‌-మెంటీ వ్యవస్థను బలోపేతం చేయాలని హెల్త్‌ వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ కోరారు.

మెడికల్‌ కాలేజీల్లో మెంటార్‌-మెంటీ వ్యవస్థ!

  • మెడికల్‌ కాలేజీల్లో మెంటార్‌-మెంటీ వ్యవస్థ!

  • ఆత్మహత్యల నివారణకు చర్యలు.. ప్రతి కాలేజీలో ఏర్పాటుకు ఆదేశం

అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌ వైద్య విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణకు కళాశాలల్లో మెంటార్‌-మెంటీ వ్యవస్థను బలోపేతం చేయాలని హెల్త్‌ వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ కోరారు. వైద్య విద్యార్థుల ఆత్మహత్యల నివారణ కోసం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సోమవారం వెబినార్‌ను నియమించారు. వైద్య కళాశాలల్లో ఉండే బోధకుల సంఖ్యకు తగ్గట్టు ఒక్కొక్కరు ఆరు నుంచి ఏడుగురు విద్యార్థులకు మెంటార్‌-మెంటీగా వ్యవహరించాలని, ఈ వ్యవస్థ బలంగా ఉంటే సత్ఫలితాలు వస్తాయని చంద్రశేఖర్‌ చెప్పారు. ప్రిన్సిపాళ్ల నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చిందని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సాయిసుధీర్‌ గుర్తుచేశారు. ఒంటరిగా ఉండడం, గైర్హాజరు పెరగడం, చదువులో వెనుకబడడం, దురలవాట్లు, పరీక్షల్లో ఫెయిల్‌ కావడం వంటి హెచ్చరిక సంకేతాలు గమనించిన వెంటనే సదరు విద్యార్థుల విషయంలో మెంటార్‌గా ఉన్నవారు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు అపర్ణ వుప్పల మాట్లాడుతూ.. మానసిక సమస్యకు సహాయం కోరడం బలహీనత కాదని, విద్యార్థులు మానసిక వైద్యులను సంప్రదించేందుకు సంకోచించకూడదని సూచించారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 06:29 AM