మణిపాల్‌లో ఆస్ట్రేలియా వీసా వైద్య పరీక్షలు
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:30 AM
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి ఆస్ట్రేలియా వీసా కోసం వైద్య పరీక్షలను నిర్వహించడానికి గుర్తింపు పొందింది. ఈమేరకు ఆసుపత్రి డైరెక్టర్ జె రామాంజనేయరెడ్డి ఒక ప్రకటన చేశారు.
తాడేపల్లి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి ఆస్ట్రేలియా వీసా కోసం వైద్య పరీక్షలను నిర్వహించడానికి గుర్తింపు పొందింది. ఈమేరకు ఆసుపత్రి డైరెక్టర్ జె రామాంజనేయరెడ్డి ఒక ప్రకటన చేశారు. ‘ఈ సేవలను రాష్ట్రంలో అందిస్తున్న తొలి ఆసుపత్రిగా మా మణిపాల్ నిలిచింది. ఈ గుర్తింపుతో రాష్ట్రంతో పాటు ఇతర తెలుగు ప్రాంతాల నుంచి ఆస్ట్రేలియా వెళ్లదలిచినవారు వైద్యపరీక్షల కోసం ఇకమీదట హైదరాబాద్, చెన్నై వంటి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేదు. తాడేపల్లిలోనే 501, 502, 704, 709 కేటగిరీల వైద్యపరీక్షలను పూర్తి చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ వైద్యపరీక్షలు సోమవారం నుంచి శనివారం వరకు, ఉదయం తొమ్మిది నుంచి సాయంకాలం అయిదు గంటలవరకు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు హెచ్‌ఏపీఐడీ, పాస్‌పోర్టు, ఈ మెడికల్ రిఫరల్ లెటర్ తమవెంట తెచ్చుకోవాలి’ అని రామాంజనేయరెడ్డి తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి